బెంగళూరులో ప్రైవేటు ఫంక్షన్‌లో పక్కపక్కనే జగన్, కేటీఆర్
- పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న జగన్, కేటీఆర్
- ఇద్దరు కలిసి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు వైరల్
- కేటీఆర్ చెబుతుంటే వింటూ కూర్చున్న జగన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి టర్మ్ తెలుగుదేశం, రెండో టర్మ్ వైసీపీ ప్రభుత్వాలు పాలించాయి. ఈ క్రమంలో 2019 నుంచి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాయానే ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాయి.
ఇటీవల కేసీఆర్ పై, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై జగన్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు ఒక వేడుకలో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.