విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్
- రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్
- గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి
- 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
2026 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీని ఆ పార్టీ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమిలోని సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలతో పాటు, కూటమి నుంచి విడిపోయిన కాంగ్రెస్ (5 సీట్లు) మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మిత్రపక్షాలు టీవీకేకు మద్దతిస్తామని తనను సంప్రదించినప్పుడు, అది వారి ప్రజాస్వామ్య హక్కు అని భావించి తాను అడ్డుకోలేదని స్టాలిన్ వివరించారు. డీఎంకే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో గెలిచిన తమ మిత్రపక్షాల మద్దతుతోనే ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహపరచలేదని, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.