సామాజిక మాధ్యమాలలో వ్యక్తిత్వ హననం దురదృష్టకరం: చంద్రబాబు
- అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగం రూపొందించారని వెల్లడి
- మంగళగిరి ఏపీ హైకోర్టు న్యాయవాదుల కార్యక్రమంలో సీఎం ప్రసంగం
- ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్న ముఖ్యమంత్రి
‘ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దానిని సరిదిద్దుతోంది. మీడియా రంగంలో ఇటీవల చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో అందరూ రచయితలే, అందరూ సంపాదకులే. అయితే, సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి. 2014లో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాం. వచ్చే ఏడాది మూడో స్థానానికి, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.