నితీశ్ కుమార్‌తో భేటీ అనంతరం చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
- 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక చాలామంది తన పనైపోయిందని అనుకున్నారని వ్యాఖ్య
- 2005 తర్వాత తమకు ఇవే అత్యుత్తమ ఫలితాలు అన్న చిరాగ్
- కావాలని తమ కూటమిలో విబేధాలు సృష్టించాలని ప్రయత్నించారన్న చిరాగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో కూటమిలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత తన పని అయిపోయిందని చాలామంది అనుకున్నారని పేర్కొన్నారు.
ఈ విజయం తనకు ఎంతో విలువైనదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై నితీశ్ కుమార్‌తో చర్చించినట్లు వెల్లడించారు. బీహార్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని అభినందించామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు.
2005లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించిందని, ఆ తర్వాత ఇవే తమకు అత్యుత్తమ ఫలితాలు అని అన్నారు. తమ కూటమిలో ఎల్‌జేపీ, జేడీయూ పాత్రపై ఎన్నికల సమయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాము కలిసికట్టుగా ముందుకు సాగామని అన్నారు. 2025లో మాపై నమ్మకం ఉంచి ఎన్డీయే మాకు ఐదు ఎంపీ స్థానాలు కేటాయిస్తే విజయం సాధించామని, ఒక్క ఎమ్మెల్యే లేని మాకు 29 స్థానాలు కేటాయిస్తే 19 గెలుచుకున్నామని అన్నారు.
గెలవలేని స్థానాలను తమకు కావాలనే ఇచ్చారని జేడీయూపై విమర్శలు చేశారని, తద్వారా తమ మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ఈ ఫలితాలు ఆ ఆరోపణలను తిప్పికొట్టాయని అన్నారు. ఆర్జేడీ క్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోందని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. 90లలో నడిచిన జంగిల్ రాజ్‌ను ప్రజలు మరోసారి తిప్పికొట్టారని అన్నారు.