ప్రపంచ తెలుగు మహాసభలకు తేదీలు ఖరారు

Andhra
Advertisement
  • జనవరిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
  • గుంటూరులో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
  • ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు
  • తెలుగు వైభవ పురస్కారాలకు ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
  • గవర్నర్‌ను ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా జనవరి 4న జరిగే "తెలుగు వైభవ పురస్కారాల" ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు అంగీకరించారు.

ఈ మేరకు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని ఇంద్రసేనారెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మాతృభాష అయిన తెలుగును నిలబెట్టుకోవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని గుర్తుచేశారు. కాగా, గుంటూరులోని అమరావతి శ్రీసత్య సాయి స్పిరుచ్యువల్‌ సిటీ ప్రాంగణంలో (హైవే) ఉన్న నందమూరి తారకరామారావు వేదికపై ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Indrasena ReddyWorld Telugu ConferenceTelugu MahasabhaluAndhra Saraswatha ParishathGunturTelugu LanguageTelugu CultureGhazal SrinivasTripura Governor

More Telugu News

ఆకాశమే హద్దుగా.. 13,629 అడుగుల ఎత్తులో భారత వాయుసేన ప్రపంచ రికార్డు!

07 Nov, 16:56

బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. ఓటమి బాటలో కుమార్తె

07 Nov, 16:41

30,273 ఓట్ల మెజార్టీ.. ఏపీలోనే టాప్‌.. పరిషత్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే..!

07 Nov, 16:26

రాహుల్‌ వెనుక విదేశీ టూల్‌కిట్‌? బీజేపీ చీఫ్‌ నబీన్‌ సంచలన ఆరోపణలు!

07 Nov, 16:12

పల్లె, పట్టణం ఏకమై కూటమికి పట్టం కట్టాయి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

07 Nov, 16:00

కివీస్‌ ఆశలపై వర్షం నీళ్లు.. డీఎల్‌ఎస్‌తో భారత్‌కు సిరీస్‌లో రెండో విజయం!

07 Nov, 15:58

ఎమ్మెల్సీపై డెకాయిటీ కేసులా?: చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

07 Nov, 15:51

విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం

07 Nov, 15:44

భారత్‌లో ఏ క్యాన్సర్‌ ఎక్కువో తెలుసా? మహిళలు, పురుషుల్లో టాప్‌-3 ఇవే!

07 Nov, 15:42

కివీస్‌పై చెలరేగిన గుర్నూర్ బ్రార్.. జవగళ్ శ్రీనాథ్ తర్వాత అరుదైన ఘనత

07 Nov, 15:28

'ట్రంప్‌ను ఇకపై నమ్మలేం'.. అమెరికా దాడుల భయంతో ప్ర‌జ‌ల‌కు అయోడిన్ మాత్రలు పంచుతున్న‌ ఇరాన్!

07 Nov, 15:10

టెస్లా కీలక నిర్ణయం.. మూడేళ్లకే అంతమవుతున్న మస్క్‌ కల!

07 Nov, 15:09

మేకపాటి సొంతూరిలో టీడీపీ జెండా.. పరిషత్ ఉపఎన్నికల్లో కూటమి హవా

07 Nov, 15:03

మంచి నిద్రతో షుగర్‌, గుండెజబ్బుల ప్రభావానికి చెక్‌.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు!

07 Nov, 14:51

వీపుపై కోతిపిల్ల.. బైక్‌పై యజమాని.. ఈ క్యూట్ వీడియో చూశారా?

07 Nov, 14:49
..More Telugu News