ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదు .. డీజీపీని నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు
- డీజీపీని వివరణ కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని డీజీపీకి ఆదేశం
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జూదం నిర్వహించడం, ఆడడం రెండూ నేరమని, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం శిక్షార్హమైన చర్యలని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు.
పోలీసు అధికారులు ఈ అంశంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.