ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్!
- సత్యరాజ్ నాయకుడిగా 'త్రిబాణధారి బార్బరీక్'
- సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్
- ఆగస్టులో విడుదలైన సినిమా
- ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్
సత్యరాజ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఉదయభాను .. సత్యం రాజేశ్ .. వశిష్ఠ ఎన్ సింహా .. సాంచీ రాయ్ వీటీవీ గణేశ్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
కథ విషయానికి వస్తే, శ్యామ్ ఓ సైకియాట్రిస్ట్. ఆయన కొడుకు .. కోడలు చనిపోతారు. మనవరాలైన 'నిధి' కోసం అతను బ్రతుకుతుంటాడు. ఆ పాపను అతను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజున ఆ పాప కనిపించకుండా పోతుంది. దాంతో శ్యామ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.