Charlie Kirk: భవనం పైకప్పుపై కిర్క్ హంతకుడి పరుగు.. కీలక వీడియో విడుదల!

Charlie Kirk Attacker Runs on Rooftop Key Video Released
  • నిందితుడి ఫొటోలను బహిర్గతం చేసిన దర్యాప్తు సంస్థలు
  • ఆచూకీ చెబితే రూ. 83 లక్షల భారీ రివార్డు ప్రకటన
  • హత్యకు వాడిన 'హై-పవర్ రైఫిల్'ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ఘటనా స్థలంలో కీలకమైన వేలిముద్రలు, డీఎన్‌ఏ ఆధారాల సేకరణ
అమెరికాను రాజకీయంగా కుదిపేసిన కన్జర్వేటివ్ నేత, 'టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ' వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ హత్య కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు తాజాగా అనుమానిత హంతకుడికి సంబంధించిన వీడియో ఫుటేజీని, కొత్త ఫొటోలను విడుదల చేశారు. హత్యకు ఉపయోగించిన శక్తిమంతమైన రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

విలేకరుల సమావేశంలో పోలీసులు విడుదల చేసిన సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ప్రకారం నిందితుడు యూటాలోని ఒక విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని భవనం మెట్లెక్కి పైకప్పుకు చేరుకున్నాడు. అక్కడి నుంచే అతడు లక్ష్యంపై కాల్పులు జరిపినట్లు అధికారులు భావిస్తున్నారు. అనంతరం, అదే పైకప్పు మీదుగా పరుగెడుతూ అంచుకు చేరుకుని కిందకు దూకి పారిపోయినట్లు వీడియోలో స్పష్టంగా రికార్డయింది. అక్కడి నుంచి రోడ్డు దాటి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడని, ఆ ప్రాంతంలోనే 'హై-పవర్, బోల్ట్-యాక్షన్' రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. భవనంపై నిందితుడి వేలిముద్రలు, ఇతర కీలక డీఎన్‌ఏ ఆధారాలను నేర పరిశోధన నిపుణులు (ఫోరెన్సిక్) సేకరించారు.

లక్ష డాలర్ల రివార్డు
హంతకుడిని పట్టుకునేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడి అరెస్టుకు దారితీసే కీలక సమాచారం అందించిన వారికి లక్ష డాలర్లు (సుమారు రూ. 83 లక్షలు) రివార్డుగా అందజేస్తామని ప్రకటించింది. అమెరికా జాతీయ పక్షి గద్ద, జెండా చిహ్నం ఉన్న నలుపు రంగు ఫుల్-స్లీవ్ టీ-షర్ట్, నల్ల కళ్లద్దాలు, టోపీ ధరించిన అనుమానితుడి ఫొటోలను అధికారులు విడుదల చేశారు.

ఇది రాజకీయ హత్యే: ట్రంప్
ఈ ఘటనపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని ‘క్రూరమైన రాజకీయ హత్య’గా అభివర్ణించారు. హంతకుడి ఉద్దేశంపై తమకు కొంత సమాచారం ఉందని, అయితే దర్యాప్తునకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో దాన్ని తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. యూటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ మాట్లాడుతూ.. "ప్రజల సహాయం లేకుండా ఈ కేసును ఛేదించలేం. ఇప్పటికే మాకు 7,000కు పైగా క్లూస్ అందాయి. ప్రతి సమాచారం విలువైనదే" అని పేర్కొన్నారు. 
Charlie Kirk
Charlie Kirk assassination attempt
Turning Point USA
political assassination
Donald Trump
Utah
FBI reward
high power rifle
Spencer Cox
conservative leader

More Telugu News