తిరుమల ఈస్ట్ బాలాజీ నగర్ లో చిరుత సంచారం.. వీడియో ఇదిగో!
––
ఆలయంలోని సీసీటీవీ కెమెరాలలో చిరుత కదలికలను గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం ఆలయం వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. చిరుత కదలికల నేపథ్యంలో భక్తులను, సమీపంలో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.