బంజారాహిల్స్ లో కుంగిన రోడ్డు.. కూరుకుపోయిన ట్యాంకర్.. వీడియో ఇదిగో!

బంజారాహిల్స్ లో కుంగిన రోడ్డు.. కూరుకుపోయిన ట్యాంకర్.. వీడియో ఇదిగో!

Road Collapses in Banjara Hills Tanker Submerged
––
హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ లో ఓ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ నేలలో కూరుకుపోయింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నెలలో కూరుకుపోయిన ట్యాంకర్ ను తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Banjara Hills
Hyderabad
Road Collapse
Tanker Accident
Heavy Rain
GHMC
Traffic Disruption
Telangana

More Telugu News