Lady Teacher: అర్ధనగ్నంగా మారి విద్యార్థికి వీడియో కాల్స్... లేడీ టీచర్ నిర్వాకం!

Lady Teacher Arrested for Obscene Video Calls to Student
షార్ట్స్‌లో చూడండి
స్టూడెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్‌ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ టీచర్ మైనర్ విద్యార్థికి సోషల్ మీడియా ద్వారా అసభ్యకర సందేశాలు పంపింది. తాను అర్ధనగ్నంగా మారి ఆ బాలుడికి వీడియో కాల్స్ చేసింది. గత కొన్ని నెలలుగా ఆమె ఇలాగే ప్రవర్తిస్తుండడంతో, విద్యార్థి మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. ఎట్టకేలకు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. దాంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ లేడీ టీచర్ ను అరెస్టు చేశారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఇతర విద్యార్థులతో కూడా ఆమె ఇలాగే అసభ్యంగా ప్రవర్తించేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, టీచర్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది.
Go Back to Shorts
Lady Teacher
Navi Mumbai
Teacher arrested
Student harassment
Sexual harassment
Minor student
Cybercrime
Video call
Obscene messages
School teacher

More Telugu News