Sarfaraz Khan: కూరగాయలు, చికెన్ తింటూ.. 17 కిలోల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
- రెండు నెలల కాలంలో 95 కిలోల నుండి 78 కిలోలకు తగ్గిన సర్ఫరాజ్
- జిమ్‌లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న క్రికెటర్
- సర్ఫరాజ్ ఖాన్ సన్నబడటంపై నెటిజన్ల ఆశ్చర్యం
భారత క్రికెట్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇటీవల ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో తిరిగి జట్టులో స్థానం సంపాదించే లక్ష్యంతో సర్ఫరాజ్ అధిక బరువు తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నాడు. గత రెండు నెలల్లో సర్ఫరాజ్ దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్ మాత్రమే తీసుకుంటున్నాడు.
గతంలో 95 కిలోల బరువున్న సర్ఫరాజ్ ఖాన్, ప్రస్తుతం 78 కిలోలకు తగ్గినట్లు తెలుస్తోంది. బరువు తగ్గిన తర్వాత జిమ్‌లో దిగిన ఒక ఫొటోను అతడు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇంతగా సన్నబడ్డాడా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.