Indian American: అమెరికా విమానంలో భారత సంతతి వ్యక్తి హల్‌చల్.. వైరల్ వీడియో
- అమెరికా విమానంలో ప్రయాణికుల తీవ్ర ఘర్షణ
- భారత సంతతి యువకుడిపై దాడి చేశాడనే ఆరోపణలు
- తన గొంతు పట్టుకుని దాడి చేశాడన్న సహ ప్రయాణికుడు
- విమానం ల్యాండ్ అయ్యాక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ధ్యానం చేసుకోవడం వల్లే గొడవ జరిగిందంటున్న నిందితుడి తరఫు న్యాయవాది
అమెరికా విమానంలో భారత సంతతికి చెందిన యువకుడు సహ ప్రయాణికుడిపై దాడి చేశాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అయితే, తన క్లయింట్ ధ్యానం చేసుకుంటున్నాడని, దానివల్లే గొడవ మొదలైందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... జూన్ 30న ఫిలడెల్ఫియా నుంచి మయామికి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఇషాన్ శర్మ (21) అనే భారత సంతతి యువకుడు, తన ముందు సీటులో కూర్చున్న కీను ఎవాన్స్‌పై దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరూ ఒకరినొకరు మెడ పట్టుకుని ఘర్షణకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాధితుడు కీను ఎవాన్స్ పోలీసులకు తెలిపిన ప్రకారం, ఇషాన్ శర్మ ప్రవర్తన వింతగా ఉందని, "ఓ అల్పమానవుడా, నాతో పెట్టుకుంటే నీ చావు ఖాయం" అంటూ తనను బెదిరించాడని చెప్పాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, సమస్య కొనసాగితే సహాయం కోసం బటన్ నొక్కమని సూచించారని తెలిపాడు. శర్మ బెదిరింపులు ఆపకపోవడంతో బటన్ నొక్కానని, ఆ తర్వాత శర్మ తనపై దాడి చేసి గొంతు పట్టుకున్నాడని ఎవాన్స్ వివరించాడు. ఆత్మరక్షణ కోసమే తాను ప్రతిఘటించాల్సి వచ్చిందని చెప్పాడు.
విమానం మయామిలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇషాన్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దాడి కేసు నమోదు చేశారు. అయితే, మంగళవారం కోర్టులో విచారణ సందర్భంగా శర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ తన మత విశ్వాసాల ప్రకారం ధ్యానం చేసుకుంటుండగా వెనుకనున్న ప్రయాణికుడు ఇష్టపడలేదని, ఈ కారణంగానే గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.