Paramasivan Fatima: ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ .. ఆత్మలు చేసే హత్యలు!

Paramashivan Fathima Movie Update
షార్ట్స్‌లో చూడండి
హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలను తెరకెక్కించడంలో తమిళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. అందువలన తమిళం నుంచి వచ్చే ఈ తరహా జోనర్ కి సంబంధించిన సినిమాలను చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి వారందరి ముందుకు ఇప్పుడు మరో తమిళ హారర్ థ్రిల్లర్ రానుంది .. ఆ సినిమా పేరే 'పరమశివన్ ఫాతిమా'. 

తమిళంలో రూపొందిన ఈ సినిమాలో విమల్ - ఛాయాదేవి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇసక్కి కర్వన్నన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ కుమార్ .. శ్రీరంజని .. అరుళ్ దాస్ .. కూల్ సురేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే, పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలలో మతపరమైన గొడవలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు మతాల వారికి సంబంధించిన హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆత్మలు చేస్తున్న హత్యలుగా భావిస్తూ అంతా భయపడుతూ ఉంటారు. అసలు కారణం అదేనా? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ ముందుకు వెళుతుంది. ఓటీటీ వైవు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి మరి. 


Go Back to Shorts
Paramasivan Fatima
Tamil horror thriller
OTT movies
Vimal
Chaya Devi
Isakki Karvannan
Aha Tamil
Religious conflicts
Ghost killings
Tamil cinema

More Telugu News