ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ

AP Capital Land Pooling Scheme Guidelines Released
  • ల్యాండ్ పూలింగ్ పథకం-2025 విధి విధానాలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
  • భూములు ఇచ్చే రైతులకు వర్తింపజేసే ప్రయోజనాలను పేర్కొన్న ప్రభుత్వం
  • జీవో జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం-2025 విధి విధానాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వర్తించే ప్రయోజనాలను ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి వేలాది ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
Land Pooling Scheme
AP Capital

More Telugu News