ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు
- పాత, కొత్త మెడికల్ బిల్లులకు మోక్షం.. రూ.180 కోట్లు విడుదల
- నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సుమారు 26,519 మందికి ప్రయోజనం చేకూరనుందని వెల్లడి
- ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల హర్షం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన బకాయిలతో పాటు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లులను కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేయడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఈ చర్య ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని వారు అభిప్రాయపడ్డారు.