త్వరలోనే కుల్ దీప్ యాదవ్ పెళ్లి... ఘనంగా నిశ్చితార్థం
- చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక
- లక్నోలో బుధవారం స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న కుల్‌దీప్, వంశిక
- లక్నోలోని శ్యామ్ నగర్ లో ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్న వంశిక
వంశిక విషయానికి వస్తే.. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని శ్యామ్ నగర్ నివాసి. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. కుల్దీప్‌తో ఆమెకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.