పాక్ ఆర్థిక శాఖ ఎక్స్ ఖాతా హ్యాక్!
- పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎక్స్ ఖాతా హ్యాక్
- భారత్తో ఉద్రిక్తతల నడుమ రుణాలకై అభ్యర్థన పోస్ట్
- తాము పోస్ట్ చేయలేదని మంత్రిత్వశాఖ ప్రకటన
- ఖాతాను పునరుద్ధరించేందుకు యత్నాలు
"అంతర్జాతీయ రుణాల కోసం తాము ఎటువంటి ట్వీట్ చేయలేదు" అని మంత్రిత్వ శాఖ ప్రతినిధులు రాయిటర్స్ వార్తా సంస్థకు స్పష్టం చేశారు. తమ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని వారు వివరించారు.