ఏపీపీఎస్సీ కేసులో... పీఎస్ఆర్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ 

08-05-2025 Thu 15:04 | Andhra
Advertisement
  • ఇప్పటికే త్వానీ కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు
  • ఏపీపీఎస్సీ కేసులోనూ తీవ్ర ఆరోపణలు
  • పీటీ వారంట్  పై అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నేడు కోర్టులో హాజరు
Advertisement
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్ ను కాసేపట్లో విజయవాడ జైలుకు తరలించనున్నారు. 

సినీ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆయనను, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన మరో కేసులోనూ పోలీసులు పీటీ వారంట్ పై అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

పీఎస్ఆర్ ఆంజనేయులు 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగమయ్యాయని తీవ్ర ఆరోపణలున్నాయి. వాస్తవానికి మాన్యువల్ మూల్యాంకనం జరగనప్పటికీ, జరిగినట్లుగా రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఏప్రిల్ 29న ఆంజనేయులుపై ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకం), 420 (మోసం) కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోరగా, విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టు మే 7న అనుమతించింది. ఇవాళ (మే 8) ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచాలన్న ఆదేశాల మేరకు పోలీసులు పీఎస్ఆర్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు రిమాండ్ విధించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పేపర్ల మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. గతంలో డిజిటల్ పద్ధతిలో చేసిన మూల్యాంకనాన్నే, తర్వాత మాన్యువల్ పద్ధతిలో చేసినట్లుగా చూపించి అవే మార్కులు వేశారని, వాస్తవంగా పేపర్లు దిద్దకుండానే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1 కాగా, మధుసూదన్ ఏ2గా ఉన్నారు. మూల్యాంకనం కోసం ఈ సంస్థకు రూ. 1.14 కోట్లు చెల్లించగా, ఇందులో రూ. 66 లక్షల మేర అవినీతి జరిగిందని సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
Advertisement
PSR AnjaneyuluAPPSCAPPSC Group-1 Exam ScamRemandVijayawada CourtCID InvestigationPamidi Kalva MadhusudhanCorruptionAP IntelligenceAP Police

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more