కూలిపోయింది భారత్ యుద్ధ విమానమా? కేంద్రం ఏం చెబుతోందంటే...!
- ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతీకార దాడులు చేశామంటూ పాక్ దుష్ప్రచారం
- శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడి, రాఫెల్ కూల్చివేత అంటూ ప్రచారం.
- పాత ఫోటోలు, వీడియోలతో పాక్ అనుకూల ఖాతాల తప్పుడు ప్రచారం
- అసత్యాలను ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)
దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భారత ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్-చెక్ విభాగం స్పష్టం చేసింది. ఈ చిత్రం పాతదని, ప్రస్తుత ఆపరేషన్‌కు సంబంధించింది కాదని తేల్చిచెప్పింది. అదేవిధంగా, శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ను పాక్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని చూపుతున్న వీడియో కూడా పాతదని, అది పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినదని పీఐబీ స్పష్టం చేసింది.