ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామంటూ ముంబై ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్
- చండీగఢ్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందని ఫోన్
- సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం
- విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్
మరోవైపు పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను మూసివేయాలని కేంద్రం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిని తెరవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.