రేపు భారత పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

20-04-2025 Sun 20:26 | International
Advertisement
  • భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటన
  • కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న జేడీ వాన్స్
  • రేపు సాయంత్రం ప్రధాని మోదీతో చర్చలు
  • చర్చల అనంతరం వాన్స్ దంపతులకు విందు ఇవ్వనున్న మోదీ
Advertisement
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రేపు (ఏప్రిల్ 21) భారత పర్యటనకు వస్తున్నారు. జేడీ వాన్స్ ఈ పర్యటనకు కుటుంబ సమేతంగా వస్తుండడం విశేషం. జేడీ వాన్స్ అర్ధాంగి ఉష భారత సంతతి మహిళ అని తెలిసిందే. 

జేడీ వాన్స్ సోమవారం నాడు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారత వర్గాలు సిద్ధమవుతున్నాయి. జేడీ వాన్స్ కు కేంద్ర కేబినెట్ సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన భారత్ లో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన భారత్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

జేడీ వాన్స్ కుటుంబం భారత్ లో పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది. రేపు జేడీ వాన్స్ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశ రాజధానిలోని పలు చేనేత ఉత్పత్తుల దుకాణాలను సందర్శించనున్నారు. 

సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ ప్రధాని మోదీ నివాసానికి చేరుకోనున్నారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు. చర్చలు ముగిసిన అనంతరం జేడీ వాన్స్-ఉష దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు. 

వాన్స్ దంపతులు ఎల్లుండి (ఏప్రిల్ 22) జైపూర్ లోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ నెల 23న ప్రఖ్యాత తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.
Advertisement
JD VanceUS Vice PresidentIndia VisitIndia-US RelationsNarendra ModiDelhiJaipurTaj MahalSwaminarayan AkshardhamUS Vice President India Trip

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more