వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
- భార్య ప్రియుడికి కేసు నుంచి విముక్తి
- దిగువ కోర్టు తీర్పు కొట్టివేత
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేస్తూ భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.