రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

  • చార్మినార్ జోన్ ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్
  • మొక్కల కాంట్రాక్టు బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం అడిగిన శ్రీనివాస్
  • రూ. 45 లక్షల కాంట్రాక్టుకు బిల్లులు క్లియర్ చేసేందుకు రూ. 2,20,000 లక్షల లంచం 
శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. శ్రీనివాస్ చార్మినార్ జోన్ ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని అర్బన్ బయోడైవర్సిటీ వింగ్‌లో రూ. 45 లక్షల విలువైన మొక్కల కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి ఆయన కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశారు.

కాంట్రాక్టర్ నుంచి రూ. 2,20,000 లంచం డిమాండ్ చేయగా, అందులో భాగంగా రూ. 70,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


More Telugu News