జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది ఉండదన్న వెంకయ్యనాయుడు
- ఎన్నికల ఖర్చు కూడా ఆదా అవుతుందని వ్యాఖ్య
- అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శ
జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని అన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేక పోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం సరికాదని వ్యాఖ్యానించారు.