హెచ్‌సీయూ ఏఐ వీడియోలు పోస్టు చేశారని బీఆర్ఎస్ నాయకులపై కేసు

  • కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్, థామస్ అగస్టీన్‌పై కేసులు నమోదు
  • ఇప్పటికే 7 కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • పలువురు ప్రముఖుల పైనా కేసు నమోదు చేసే అవకాశం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూములకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్, థామస్ అగస్టీన్‌లపై కేసులు నమోదు చేశారు. ఏఐ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారంటూ గచ్చిబౌలి పోలీసులు ఇదివరకే 7 కేసులు నమోదు చేశారు.

ఏఐ ఫొటోలను సృష్టించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు. వీరితో పాటు హెచ్‌సీయూ వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా సుమారు 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ధ్రువ్ రాఠీ, రవీనా టాండన్, జాన్ అబ్రహం, దియా మీర్జా సహా మరికొందరు ప్రముఖులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News