శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే... ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్
- రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు
- ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్న పవన్
- రేపు భద్రాచలం వెళుతున్న రేవంత్ రెడ్డి
రేపు సీతారాముల కళ్యాణానికి పవన్ హాజరవుతారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమవుతారు. రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, రేపు స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.