రైల్ రోకో కేసు కొట్టి వేయాలని కేసీఆర్ పిటిషన్.. విచారణ చేపట్టిన హైకోర్టు
- తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌పై రైల్ రోకో ఘటనలో కేసు నమోదు
- 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్ రోకో
- ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉన్న కేసు
అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పీపీ కోర్టుకు తెలిపారు.
రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రైల్ రోకో ఘటన గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.