మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
- ఛత్తీస్ గఢ్ లో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు
- వీరిలో 10 మంది మహిళా మావోయిస్టులు
- అందరికీ పునరావాసం కల్పిస్తామన్న బీజాపూర్ ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... 50 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారని తెలిపారు. వీరి లొంగుబాటులో సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ కీలక పాత్ర పోషించాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా వీరిలో ఒక్కొక్కరికి రూ. 25 వేల చెక్ లను అందించామని తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు.