దోమలు ఇక మనపై వాలాలంటేనే భయపడతాయి.. శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం
- మలేరియా దోమలకు నిటిసినోన్ ఔషధంతో చెక్
- నిటిసినోన్ వాడే రోగులపై జరిపిన పరిశోధనలో పురోగతి
- ఆ ఔషధం వాడే వ్యక్తుల రక్తం దోమలకు విషం
- నిటిసినోన్ వల్ల మనుషులకు కానీ, పర్యావరణానికి కానీ ఎలాంటి ముప్పు లేదన్న శాస్త్రవేత్తలు
నిటిసినోన్ సాధారణంగా అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషధం దోమలకు ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధనలో తేలింది. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నిటిసినోన్ రోగుల జీవక్రియలకు సహకరిస్తూనే, వారి రక్తాన్ని తాగిన దోమల జీవక్రియకు మాత్రం విఘాతం కలిగిస్తుందని, ఫలితంగా ఆ దోమలు 12 గంటల్లోనే మరణిస్తున్నాయని గుర్తించారు. నిటిసినోన్ చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుందని, దీని వల్ల మనుషులకు, పర్యావరణానికి ఎటువంటి హాని లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.