అమెరికాలో స్టూడెంట్ కు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- ఆఫ్ క్యాంపస్ లోని అపార్ట్ మెంట్ నుంచి బలవంతంగా తరలింపు
- వివరాలు తెలియవంటున్న వర్సిటీ అధికారులు
- వీసాను రద్దు చేసినట్లు ప్రచారం, స్పందించని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసు
భుజాన బ్యాగుతో వెళుతున్న విద్యార్థినిని చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. చేతులు వెనక్కి విరిచి బేడీలు తగిలించారు. ఆపై కారులో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు తెలియరాలేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాగా, సదరు విద్యార్థిని వీసా రద్దు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ కానీ, విద్యార్థిని తరపు న్యాయవాది కానీ ఇంకా స్పందించలేదు. స్టూడెంట్ ను అరెస్టు చేసి తీసుకెళుతున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.