హైదరాబాద్ ఐపీఎల్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త

  • ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు
  • ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో బస్సులు
  • 24 బస్సు డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు
క్రికెట్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి చేరుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 బస్సు డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి మే 21వ తేదీ వరకు వివిధ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో మ్యాచ్‌లు ఉన్నాయి. ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎల్బీనగర్, ఎన్జీవోస్ కాలనీ, కోఠి, లక్డీకాపూల్, దిల్‌సుఖ్ నగర్, మేడ్చల్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, మియాపూర్, జేబీఎస్, చార్మినార్, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.


More Telugu News