Manchu Vishnu: వీరిద్దరిలో పెద్ద రౌడీ ఎవరు?.. మోహన్‌బాబు, ఆర్జీవీ ఫొటోను షేర్ చేసిన విష్ణు

Manchu Vishnu Shares Photo with Mohan Babu and RGV

  • మోహన్‌బాబు, రాంగోపాల్ వర్మ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మంచు విష్ణు
  • మంచు మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్ అంటూ సరదాగా కామెంట్ చేసిన విష్ణు
  • మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న విడుదల

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు కలిసి ముచ్చటించుకుంటున్న ఫొటోను నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వారి పేర్లను కూడా మార్చేశారు. ‘‘ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్‌గా సాగింది. మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్. వీరిలో పెద్ద రౌడీ ఎవరు? అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు.

కాగా, విష్ణు, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో ‘రౌడీ’ అనే సినిమాను వర్మ రూపొందించారు. అలాగే, విష్ణు హీరోగా ‘అనుక్షణం’ సినిమా తీశారు. 2014లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. మరోవైపు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తుండగా, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ నటులు ఈ మూవీలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.

Manchu Vishnu
Mohan Babu
Ram Gopal Varma
Rgv
Rowdy
Kannappa Movie
Anukshanam Movie
Telugu Cinema
Tollywood
Actor
  • Loading...

More Telugu News