ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలపై చర్చించాం: మహేశ్ కుమార్ గౌడ్
- అధిష్ఠానం పెద్దలతో గంటన్నర పాటు సమావేశం
- తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడి
- కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించామన్న మహేశ్ కుమార్ గౌడ్
సమావేశం అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించినట్లు తెలిపారు. అన్ని శాఖలపై సమగ్ర సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం అడిగి తెలుసుకుందని ఆయన అన్నారు. త్వరలో అన్ని అంశాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.