వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు
- ముంబైలో ప్రారంభమైన వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు
- వచ్చే నెలలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్‌లకు సేవల విస్తరణ
- రూ. 299 ప్యాక్ నుంచి 5జీ సేవలు
ప్రస్తుతానికి అపరిమిత యాడ్ ఆన్ కింద రూ. 299తో మొదలయ్యే పథకాల్లో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. తొలి దశ విస్తరణ అనంతరం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నైలకు 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్‌సింగ్ తెలిపారు. ఫైబర్ కేబుళ్లు, సెల్ టవర్లు వంటి సంప్రదాయ అనుసంధాన వసతులు లేని ప్రదేశాల్లో శాటిలైట్ సేవల కోసం కొన్ని సంస్థలతో చర్చిస్తున్నట్టు జగ్బీర్‌సింగ్ తెలిపారు.