మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు
- కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిపై కేసు
- కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలు బదిలీ చేసుకున్నట్టు ఆరోపణలు
- ఈ కేసులో ఏ2గా విజయసాయి
- గత బుధవారం ఓసారి విజయసాయిని విచారించిన సీఐడీ అధికారులు
- ఈ నెల 25న మరోసారి రావాలంటూ తాజాగా నోటీసులు
గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆ సమయంలోనే విజయసాయికి సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.
కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు ఫిర్యాదుతో నమోదైన కేసులో విజయసాయి, మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. ఇందులో విజయసాయి ఏ2గా ఉన్నారు.