అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం... చంద్రబాబు, పవన్ మధ్య సరదా క్షణాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, సరదాగా గడిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సరదా క్షణాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు స్వయంగా కాఫీ కప్ అందించగా... పవన్ చిరునవ్వుతో స్వీకరించారు. చంద్రబాబు తదితరులు ఈ స్టాల్ లో ఉంచిన పలు అరకు కాఫీ ఉత్పత్తులను కూడా ఆసక్తిగా పరిశీలించారు.



