గవర్నమెంట్ జాబ్ ఉన్న వరుడి కోసం రోడ్డుపై యువతి వెతుకులాట.. వీడియో ఇదిగో!
- పెళ్లికూతురు అలంకరణలో ఫ్లకార్డుతో నిలబడిన వైనం
- నల్లగా ఉన్నా పర్వాలేదంటున్న యువతి
- ప్రభుత్వ ఉద్యోగినే పెళ్లి చేసుకుంటా.. వైరల్ గా మారిన ఫ్రాంక్ వీడియో
రోడ్డుపై వచ్చిపోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అంటూ అడుగుతూ కాదనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. చివరకు ఓ మధ్యవయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ ఫ్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్లు పెడుతున్నారు.