రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..?
- నాలుగు రోజులకు రూ. 3 కోట్లు అందుకున్న వార్నర్
- సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి
- టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ క్రికెటర్
తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ..
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్ సుదీర్ఘంగా ఆడారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ అండ్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసిన వార్నర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్ ను రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. నాలుగు రోజుల షూటింగ్ కు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించారు. కాగా, ఈ నెల 28న రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది.