నిర్మాతగా మారిన సమంత.. తొలి సినిమా విడుదలకు రెడీ
- నిర్మాతగా మారిన సమంత
- శుభం పేరుతో తొలి సినిమా నిర్మాణం
- త్వరలోనే థియేటర్స్‌లో విడుదల
తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణంలో తొలి ప్రాజెక్ట్‌గా 'శుభం' పేరుతో ఓ తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. వసంత్ మరిగంటి అందించిన కథతో సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు ఈ చిత్రంలో పలు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయని యూనిట్ చెబుతోంది. సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణిలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపిస్తారు.
త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్‌సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్‌చరణ్ తేజ్, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్‌లు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.