ఏపీ హైకోర్టులో కొడాలి నానికి స్వల్ప ఊరట
- గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నానిపై ఫిర్యాదు
- విశాఖ త్రీ టౌన్ పీఎస్ లో కేసు నమోదు
- కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్
- నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం
అయితే, ఈ కేసును కొట్టి వేయాలంటూ కొడాలి నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కొడాలి నానికి స్వల్ప ఊరటనిచ్చింది. తొందరపాటు చర్యలు వద్దని, 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.