నిన్ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశా.. నితీశ్ వ్యాఖ్యలకు తేజస్వీ యాదవ్ కౌంటర్
- లాలూను సీఎంను చేశానంటూ బిహార్ అసెంబ్లీలో నితీశ్ కామెంట్
- నితీశ్ కంటే ముందే లాలూ రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశాడని తేజస్వి వివరణ
- ఎంతోమంది ప్రధాన మంత్రులను చేసిన ఘనత తన తండ్రిదని వెల్లడి
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ పేరుతో జేడీయూ, ఆర్జేడీ ఉమ్మడిగా పోటీ చేశాయని తేజస్వి గుర్తుచేశారు. ఆ సమయంలో నితీశ్ పార్టీ జేడీయూకు కేవలం 71 సీట్లు మాత్రమే వచ్చాయని, ఆర్జేడీకి 80 సీట్లు వచ్చినా కూడా నితీశ్ ను సీఎంను చేశామని తెలిపారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని 2022 లో మరోమారు తమతో పొత్తుకు చేతులు కలిపిన నితీశ్ ను మళ్లీ సీఎం పదవిలో కూర్చోబెట్టామని, ఏడాది గడిచిన తర్వాత తమకు హ్యాండిచ్చి మరోమారు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని తేజస్వి ఆరోపించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురించి మాట్లాడే ముందు తాను చేసిన సాయాన్ని గుర్తుచేసుకోవాలంటూ నితీశ్ కుమార్ కు తేజస్వి హితవు పలికారు.