యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు... తప్పిన ప్రాణాపాయం
- గజ్వేల్ నుంచి భువనగిరికి వెళ్లే దారిలో కారులో మంటలు
- కారులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్
- కారులో నుంచి ప్రయాణికులు దిగడంతో తప్పిన ముప్పు
వెంటనే అందరూ కారులో నుంచి కిందకు దిగడంతో ముప్పు తప్పింది. కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంపై పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పైరింజన్‌తో ప్రమాదస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సమయంలో అటుగా వెళుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.