ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఆటగాడు జాద్రాన్ సరికొత్త రికార్డు
- ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా జాద్రాన్ రికార్డు
- ఇంగ్లండ్ క్రికెటర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన జాద్రాన్
- ఏడు వికెట్ల కోల్పోయి 325 పరుగులు చేసిన ఆప్ఘనిస్థాన్
ఇప్పటిదాకా ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ (165) పేరిట ఉంది. బెన్ డకెట్ రికార్డును జాద్రాన్ బద్దలు కొట్టాడు. ఆప్ఘన్ బ్యాటర్లలో జాద్రాన్‌తో పాటు అజ్మతుల్లా 41, మహమ్మద్ నబీ 40, హష్మాతులా షాహిది 40 పరుగులతో రాణించారు. తొలుత జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆఫ్గనిస్థాన్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జాద్రాన్, అజ్మతుల్లా రాణించారు.