విద్యార్థులకు అలర్ట్! ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
Advertisement

విద్యార్థులకు అలర్ట్! ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

EAPSET applications submission date postoponed
  • నేటి నుండి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ వాయిదా
  • మార్చి 1వ తేదీ నుండి స్వీకరించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడి
  • ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఈరోజు సాయంత్రం ప్రారంభం కావాల్సిన ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడినట్లు ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి 1వ తేదీన ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు సాయంత్రం 4.45 గంటల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 1న ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

ఎలాంటి ఆలస్య  రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి జేఎన్టీయూ రెండు హెల్ప్ లైన్‌లను ఏర్పాటు చేసింది. 7416923578 లేదా 7416908215 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Advertisement
EAPSET
Telangana
Hyderabad

More Telugu News