ఇవాళ ఏపీ అసెంబ్లీకి వర్కింగ్ డే కాదా...?
- అసెంబ్లీకి వరుసగా 60 పనిదినాల పాటు రాకపోతే అనర్హత వేటు
- నేడు అసెంబ్లీకి జగన్ రాక ప్రాధాన్యత సంతరించుకున్న వైనం
- నేడు గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయమేనన్న అధికారులు
- సాంకేతికంగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అని వివరణ
- ఇవాళ్టి సంతకాలు పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడి
అయితే, ఇవాళ అసెంబ్లీకి వర్కింగ్ డే కాదని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగించడం లాంఛనంగా జరిగే కార్యక్రమని, ఇది వర్కింగ్ డేగా పరిగణించబోరని అధికారులు వివరించారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా లెక్కిస్తారని స్పష్టం చేశారు.
ఇవాళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై సంతకాలు చేసినప్పటికీ, ఆ సంతకాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు వివరించారు. సాంకేతికంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం అవుతున్నట్టు లెక్క అని తెలిపారు.