తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్!

24-02-2025 Mon 16:16 | Telangana
Advertisement
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • రేపు సాయంత్రం నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బంద్
  • మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు కూడా బంద్
Advertisement
తెలంగాణలో మద్యం దుకాణాలు మూడు రోజులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే తేదీతో పాటు, ముందుగా రెండు రోజులు కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో రేపటి నుండి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
Advertisement
LiquorTelanganaGraduate MLC Elections

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more