సజ్జల రామకృష్ణారెడ్డి భూములపై నేటి నుంచి మరోసారి సర్వే
- చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి భూములు
- రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించినట్టు గత సర్వేలో తేలిన వైనం
- హైకోర్టును ఆశ్రయించిన సజ్జల
- న్యాయస్థానం ఆదేశాలతో నేటి నుంచి మరోమారు సర్వే
కాగా, వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి భూములున్నాయి. సజ్జల సందీప్‌రెడ్డి పేరున 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్‌రెడ్డి పేరున 16.85 ఎకరాలు, వై.సత్యసందీప్‌రెడ్డి పేరున 21.46 ఎకరాలతోపాటు సజ్జల విజయకుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూములు ఉన్నట్టు తేలింది. ఈ మొత్తం భూముల్లో 55 ఎకరాల వరకు ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్టు గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే, వీటిలో తమ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది. రెవెన్యూ శాఖ మాత్రం భూముల ఆక్రమణ జరిగినట్టు రికార్డులు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సర్వేకు సిద్ధమైంది.