ప్రపంచకప్ గెలిస్తే రూ.5 లక్షల నజరానానా?.. సీఎం బహుమతిని తిరస్కరించిన ఖోఖో ఆటగాళ్లు
- ఆటగాళ్లను ఘనంగా సత్కరించిన కర్ణాటక ముఖ్యమంత్రి
- సీఎంను అవమానించలేదన్న ఆటగాళ్లు
- పక్క రాష్ట్రంలో రూ. 2.25 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని వెల్లడి
ప్రభుత్వ బహుమతి ప్రకటనపై గౌతమ్ మాట్లాడుతూ.. తమ విజయాన్ని మరింత గౌరవంగా అంగీకరించాలని అన్నారు. మహారాష్ట్ర ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం రూ. 2.25 కోట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని చెప్పారు. కర్ణాటకలో మాత్రం ఆ స్థాయి గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఈ విషయంపై మరోసారి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళల జట్టు సభ్యురాలు చైత్ర స్పందిస్తూ.. తాము కూడా ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లమే అయినా ఇతర క్రీడా జట్లకు లభించే గౌరవం దక్కడంలేదని వాపోయారు. రూ. 5 లక్షల బహుమతితో క్రీడను కొనసాగించడం ఎలా? అని ఆమె ప్రశ్నించారు.