ఏపీలో టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. నలుగురి మృతి

17-01-2025 Fri 07:57 | Andhra
Advertisement
  • చిత్తూరు జిల్లా శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆగి ఉన్న టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం
  • గాయపడిన 13 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
Advertisement
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు శివారు గంగాసాగరం వద్ద జరిగింది. 

తిరుపతి నుంచి మధురై వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం 20 అడుగులు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంటు స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో కరెంటు స్తంభం బస్సులోకి చొచ్చుకుని రావడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 

ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు, నరివి ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. 
Advertisement
Chittoor DistrictRoad AccidentAndhra Pradesh

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more